Monday, September 23, 2019
Follow Us on :

దేవుడే భారత క్రికెట్‌ను రక్షించాలి.. అంటూ సంచలన ట్వీట్ చేసిన గంగూలీ

By BhaaratToday | Published On Aug 7th, 2019

సౌరవ్ గంగూలీ.. ఏది ఉన్నా నిక్కచ్చిగా మాట్లాడుతారు. తాజాగా ఆయన భారత క్రికెట్ ను ఆ దేవుడే కాపాడాలి అంటూ ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది. అది కూడా తన మిత్రుడైన రాహుల్ ద్రవిడ్ కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల నోటీసును పంపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరో యువ క్రికెటర్స్ ను తయారుచేస్తున్న ద్రావిడ్ పై నోటీసులు పంపడం గంగూలీకి నచ్చలేదు.. దీంతో 'ఇండియన్ క్రికెట్లో కొత్త ఫ్యాషన్ వచ్చింది. ప్రరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం. వార్తల్లో నిలిచేందుకు ఇది బాగా తోడ్పడుతోంది. ఇండియన్ క్రికెట్ ను దేవుడే కాపాడాలి. ద్రావిడ్ కు బీసీసీఐ ఎథిక్స్ కమిటీ అధికారి నోటీసులు పంపారు' అంటూ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.


రాహుల్ ద్రావిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ ఉన్నాడు. ద్రవిడ్ పై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ ఎథిక్స్ కమిటీ అధికారి జస్టిస్ (రిటైర్డ్) డీకే జైన్ కు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఎన్సీఏ డైరెక్టర్ గా ఉన్న ద్రవిడ్... ఇండియా సిమెంట్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారని ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎథిక్స్ కమిటీ నుంచి ద్రవిడ్ కు నోటీసులు అందాయి. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసులో చెప్పారు. ఎంతో కష్టపడుతున్న ద్రావిడ్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం గంగూలీకి నచ్చలేదు. దీంతో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.