Monday, November 18, 2019
Follow Us on :

ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ ను 'గే' అన్నందుకు ఫలితం అనుభవించిన క్రికెటర్..!

By BhaaratToday | Published On Feb 14th, 2019

 

ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను ‘గే’ అని గ్రౌండ్ లోనే అనేశాడు వెస్టిండీస్ బౌలర్ షనాన్ గాబ్రియెల్‌.  రూట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన విండీస్ బౌలర్ షానన్ గాబ్రియేల్ ‘హోమో ఫోబిక్’ అనే పదాన్ని ఉపయోగించాడు. హోమో ఫోబిక్’ (గే) అనే పదాన్ని తిట్టడానికి వాడొద్దని, ‘గే’గా ఉండడంలో తప్పులేదని జో రూట్‌ గాబ్రియెల్ ను  సముదాయించాడు. వీరి సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. ‘గే’గా ఉండడం తప్పుకాదన్న ఇంగ్లండ్ జట్టు సారథి జో రూట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీరోగా మారాడు. రూట్ సమయస్ఫూర్తికి, పరిణతికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

అయితే షనాన్ గాబ్రియెల్‌ మాత్రం ఫలితం అనుభవించక తప్పదు. నాలుగు వన్డేల నిషేధం ఎదుర్కోనున్నాడు. ఇంగ్లండ్‌తో త్వరలో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో తొలి నాలుగు వన్డేలు ఆడకుండా గాబ్రియెల్‌ను సస్పెండ్ చేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గాబ్రియెల్ మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోతతోపాటు మూడు డీమెరిట్ పాయింట్లు అందుకోనున్నాడు.