Thursday, September 19, 2019
Follow Us on :

మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న యూనివర్సల్ బాస్

By BhaaratToday | Published On Apr 14th, 2019

విండీస్ విధ్వంసకర ఆటగాడు, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనివర్సల్ బాస్  క్రిస్ గేల్ మరో అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా వందసార్లు 50కిపైగా స్కోరు నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మొహాలీలో శనివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గేల్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన గేల్ టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు ఎవరూ సాధించలేని అరుదైన రికార్డును తన పేరున నమోదు చేసుకున్నాడు. గేల్ వందసార్లు 50కిపైగా చేసిన స్కోర్లలో 21 సెంచరీలు, 79 అర్ధ సెంచరీలు ఉన్నాయి. గేల్ తర్వాతి స్థానంలో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. మిల్లర్ 73సార్లు 50కిపైగా స్కోర్లు నమోదు చేశాడు.