Sunday, August 18, 2019
Follow Us on :

ఆమె 'నమో అగైన్' టీషర్టు ధరించడమే పాపమైపోయింది

By BhaaratToday | Published On Mar 20th, 2019

నమో అగైన్.. అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించాలనే ఆకాంక్ష ఉన్న వాళ్ళు ఈ నినాదాన్ని తయారుచేశారు. ఆయన ఫాలోవర్లు 'నమో అగైన్' అన్న నినాదం ఉన్న బట్టలు ధరించి.. ఆయనకు మద్దతు తెలుపుతూ ఉంటారు. అయితే అలా ఓ యువతి కూడా ధరించింది. అలా ఆమె చేయడమే తప్పైపోయింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ యువతితో దురుసుగా ప్రవర్తించారు.      

కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వారణాసిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అస్సీ ఘాట్‌ వద్ద ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్థానిక కాలేజీకి చెందిన ఓ యువతి ‘నమో అగైన్‌’ అని రాసి ఉన్న నీలిరంగు టీ షర్ట్‌ను ధరించి అటుగా నడుచుకుంటూ వెళుతోంది. ఆ మహిళను చూసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమెను చుట్టుముట్టారు..  ‘చౌకీదార్‌ చోర్ హై’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. తప్పేమీ లేకున్నా కూడా యువతిని అరెస్టు చేస్తామని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పారు.