Sunday, August 25, 2019
Follow Us on :

గూగుల్‌కు మరో భారీ షాక్‌

By BhaaratToday | Published On Mar 21st, 2019

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) భారీ జరిమానా వేసింది. తన సెర్చ్ ఇంజిన్ లో ప్రత్యర్థుల యాడ్స్ బ్లాక్ చేస్తోందంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై విచారణ జరిపిన ఈయూ తాజా నిర్ణయం తీసుకుంది. గూగుల్ రూ.11,000 కోట్ల జరిమానా చెల్లించాలని ఈయూ వర్గాలు పేర్కొన్నాయి. గత రెండేళ్లలో ఈయూ చేతిలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఎదుర్కొన్న మూడో అతిపెద్ద జరిమానా ఇది. గతేడాది కూడా ఇదే విషయమై ఈయూ గూగుల్ పై 4.34 బిలియన్ యూరోల జరిమానా విధించింది. అంతకుముందు, 2017లో 2.42 యూరోల జరిమానా వడ్డించారు.

గూగుల్‌ తన విధులను మర్చిపోయి నమ్మకాన్ని కోల్పోయిందంటూ.. యూరోపియన్‌ యూనియన్‌ యాంటీ ట్రస్ట్‌ రెగ్యులేటరీ గూగుల్‌పై  భారీ మొత్తంలో జరిమానా విధించింది.  ఈ మేరకు కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టగర్  బుధవారం ఆదేశాలు జారీచేశారు. గూగుల్‌ తన అధికారాన్ని గూగుల్‌ దుర్వినియోగం  చేస్తోందని, దాని వల్ల కొన్ని కంపెనీలు లాభాలు గడిస్తున్నాయన్నారు.