Saturday, August 24, 2019
Follow Us on :

2000 కేజీల స్వీట్స్ ఆర్డర్ ఇచ్చిన బీజేపీ నేత.. అందుకే..!

By BhaaratToday | Published On May 21st, 2019

ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. పలు పార్టీల నేతలు తామే గెలుస్తామని ధీమాగా చెప్పుకొంటూ ఉన్నారు. కానీ మనసులో ఎంతో కొంత డౌట్ అయితే ఉండే ఉంటుంది.  అయితే భారతీయ జనతా పార్టీ నేత గోపాల్ శెట్టి మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముంబైకి చెందిన గోపాల్ శెట్టి మాత్రం ఏకంగా 2000 కిలోల స్వీట్స్ ఆర్డర్ ఇచ్చేశాడు. ముంబై నార్త్ లోక్ సభ స్థానం నుండి ఈయన పోటీ చేశారు. సినీ నటి ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ తరపున ఈయన మీదనే పోటీ చేసింది.  

mumbai modi

ఎగ్జిట్ పోల్స్ లో కూడా గోపాల్ శెట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో రిజల్ట్ రావడానికి రెండు రోజుల ముందే ఆయన స్వీట్స్ ఆర్డర్ ఇచ్చేశారు. 1500-2000 కేజీలు స్వీట్స్ తయారు చేయమని గోపాల్ శెట్టి ముంబై లోని బోరివాలి ప్రాంతంలోని స్వీట్స్ షాప్ లో ఆర్డర్ ఇచ్చారు. అందులో పని చేసే వాళ్లంతా మోదీ మాస్కులు వేసుకొనే.. గోపాల్ శెట్టి చెప్పిన ఆర్డర్ ను పూర్తీ చేస్తున్నారు. గోపాల్ శెట్టి 2014లో కూడా ఈ సీట్ లో విజయం సాధించారు. సాధారణంగా ఫలితాలు వచ్చే వరకూ ఎవరూ స్వీట్స్ ఆర్డర్ ఇవ్వరని.. కానీ గోపాల్ శెట్టి మాత్రం తమకు భారీ ఆర్డర్ ఇచ్చారని స్వీట్స్ షాపు యజమాని చెప్పుకొచ్చారు. 

modi masks