Wednesday, October 16, 2019
Follow Us on :

బ్రేకింగ్: ఆర్టికల్ 370 రద్దు….రాష్ట్రపతి ఆమోదం

By BhaaratToday | Published On Aug 5th, 2019

రాజ్యసభలో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు భారత హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన క్షణాల్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే ఉండనున్నాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు కానుంది.
అయితే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ముందస్తు ప్రణాళిక ప్రకారం, బీజేపీ ఆలోచనలను పక్కాగా అమలు చేశారు. ఈ ఉదయం 11.15 గంటల సమయంలో నిరసనల మధ్య ఆర్టికల్ 370 రద్దుకు సిఫార్సు చేయడం, ఆపై వెంటనే మూజువాణీ ఓటింగ్ తో సభ బిల్లు ఆమోదించగా, 11. 25 గంటల సమయంలోనే రాష్రపతి రామ్ నాథ్ కోవింగ్ కార్యాలయం నుంచి ఆ బిల్లుపై సంతకం చేస్తున్నట్టుగా గజిట్ ను వెలువరించింది.