Monday, November 18, 2019
Follow Us on :

అమెరికాలో మ‌రోసారి కాల్పులు...ఐదుగురు మృతి

By BhaaratToday | Published On Feb 16th, 2019

అమెరికాలోని పశ్చిమ షికాగోలో మ‌రోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్‌ పార్కు వద్ద ఓ వ్యక్తి తుపాకితో విరుచుకుపడ్డాడు. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది సహా ఐదుగురు గాయపడ్డారు. పైపులకు సంబంధించిన వాల్వుల తయారీ పరిశ్రమ హెన్రీ ప్రాట్ కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్ (45) ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మార్టిన్‌ను కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.