Friday, December 06, 2019
Follow Us on :

హఫీజ్ సయీద్ అరెస్ట్

By BhaaratToday | Published On Jul 17th, 2019

ముంబై టెర్రర్ అటాక్స్ మాస్టర్ మైండ్, జమాత్ ఉద్ దవా (JuD) ఛీఫ్ హఫీజ్ సయీద్ ను అరెస్ట్ చేశారు. కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ పంజాబ్ పోలీస్(పాకిస్థాన్) అధికారులు లాహోర్ లో అతన్ని అరెస్ట్ చేశారు. లాహోర్ నుండి గుజ్రాన్ వాలాకు అతడు వెళుతుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని జుడీషియల్ రిమాండ్ కు పంపించారు. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని హఫీజ్ సయీద్ కోర్టులో ఛాలెంజ్ చేయనున్నాడు.   

తమ గగనతలం మీదుగా అన్ని పౌరవిమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్టు పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టం చేసిన తర్వాతి రోజే ఈ అరెస్ట్ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే ఇమ్రాన్ ఖాన్ కూడా అమెరికా పర్యటనకు వెళ్లే సమయంలో ఇలా జరిగింది. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ ఆర్థికంగా చాలా దిగజారిపోతోంది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుండడంతో పెట్టుబడులు రాక అల్లాడిపోతోంది. భారత్ ఎన్ని సాక్ష్యాలు సమర్పించినా తీవ్రవాదుల అణచివేతకు నడుంబించడం లేదు పాక్.. దీంతో భారత్ పాక్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొని వస్తోంది. 

హఫీజ్ సయీద్ ఇప్పటికే ఎన్నో తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. టెర్రరిస్టులకు ఫండ్స్ చేరవేస్తుంది ఇతడే అన్నది పలుమార్లు నిరూపితమైంది. అలాగే పాకిస్థాన్ లోనే 23 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు హఫీజ్ సయీద్. అయిదు ట్రస్టులను పెట్టి తీవ్రవాదులకు ఆర్ధిక సహాయం చేస్తున్నాడు.. అలాగే ఎంతో మంది అమాయకులను తీవ్రవాదులుగా మారడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.