Tuesday, October 15, 2019
Follow Us on :

హిందూ దేవాలయాలను ఉండనివ్వరా.. పూర్వకాలంలో కాదు.. ఇప్పుడు కూడా కూల్చివేతలే..!

By BhaaratToday | Published On Feb 4th, 2019

పూర్వకాలంలో విదేశాల నుండి భారతదేశంలో చొరబడి మన దేవాలయాలను ధ్వంసం చేశారని మనం చదువుకున్నాం. కొన్ని లక్షల దేవాలయాలను అప్పట్లో కూల్చివేశారు కొందరు రాజులు. దేవాలయాలను కాపాడాలని అనుకున్న ఎంతో మంది హిందులను ఊచకోత కూడా కోశారు. అయితే కాలం మారింది.. అయినా కూడా మనం మన దేవాలయాలను కాపాడుకోలేకపోతున్నాం. ఊర్లల్లో ఉన్న పురాతన దేవాలయాలను కాపాడుకోడానికి మనం ఒకవైపు కష్టపడుతూ ఉంటే.. మరోవైపు కొందరు మన దేవాలయాలను కూల్చివేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు.    

దేవాలయాలను కూల్చివేస్తున్న ఘటనలను చాలానే చూసాం. ఇది ఇప్పుడు 'హంపి' ని కూడా తాకింది. హంపీ శిథిలాలను నాశనం చేస్తున్నారు. ముగ్గురు కుర్రాళ్లు ఓ స్తంభాన్ని కూల్చేశారు. మరొకడు ఆ దృశ్యాన్ని వీడియో తీశాడు. వీడియోలో ఉన్న స్థలం హంపీలోని లోటస్ మహల్ పక్కనే ఉన్న.. విష్ణుమూర్తి ఆలయం. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని.. అయినా ఎలాంటి చర్యలు లేవని.. హిందూ బంధువులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. 


 2016లో అచ్యుతరాయ బజార్‌లోని కొన్ని స్తంభాలను నేలమట్టం చేశారని.. అలాగే 2017లో తుంగభద్ర నదీతీరంలో ఉన్న శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనలను మరచిపోకముందే ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి జరుగుతూ పోతే ఇంకొద్ది రోజులకు మన దేవాలయాలు ఉండేవి అని చెప్పుకోవాల్సి ఉంటుంది.      

ఒకప్పటి విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు శిథిలావస్తలో ఉంది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. ఏటా లక్షల మంది పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుంచీ ఇక్కడకు వస్తూ ఉంటారు. అలాంటి ఆలయానికి కూడా రక్షణ లేకుండా పోయింది.  ఈ ఘటనపై కర్ణాటక పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వైష్ణవ ఆలయ స్తంభాన్ని కూల్చిన ఘటనలో నలుగురు లేదా ఐదుగురు పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితుల్ని అరెస్టు చేసి, శిక్ష పడేలా చేస్తామని బళ్లారి ఎస్పీ అరు రంగరాజన్ తెలిపారు.