Thursday, September 19, 2019
Follow Us on :

ప్రవీణ్ కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు.. వాడి అరాచకాలెన్నో..!

By BhaaratToday | Published On Aug 8th, 2019

వరంగల్ అర్బ‌న్ జిల్లా హన్మకొండ టైలర్స్ కాలనీలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ప్రవీణ్ కు మరణశిక్ష విధించింది కోర్టు. వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ప్రవీణ్ నేరం చేసినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది. అతడికి మరణశిక్ష విధించడంతో ఇంకోసారి ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడేలా తీర్పును ఇచ్చింది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్.   

Image result for ప్రవీణ్
ప్రవీణ్ నరరూప రాక్షసుడని, అతడొక సెక్స్‌మానియాక్‌గా మారాడని పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రవీణ్ సెక్స్ సైకో అని.. అర్ధరాత్రి ఆడవాళ్లు అతడి కంట పడితే వదిలిపెట్టేవాడు కాదని చెబుతున్నారు. ప్రవీణ్ అఘాయిత్యానికి సంబంధించిన ఓ వీడియోను కూడా పోలీసులు సేకరించారు. ఆరు బయట నిద్రించే ఆడవాళ్లే ప్రవీణ్ టార్గెట్ అని, ఎవరైనా నిద్రిస్తున్న మహిళలు కనిపిస్తే వెంట తెచ్చుకున్న సిరంజీతో వారిపై నీళ్లు జల్లేవాడని, దీంతో ఆ మహిళలు దుస్తులు దులుపుకుంటే ఆశగా చూసేవాడని పోలీసులు తెలిపారు. మహిళలు ఆరుబయట ఆరేసిన దుస్తుల వాసన చూసి ప్రవీణ్ మత్తెక్కిపోయేవాడని, అతడికి ఫిడోఫిలియా అనే మానసిక వ్యాధి ఉందని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నట్లుగా సంబంధిత వర్గాల సమాచారం.  ప్రవీణ్‌కు సెక్స్ కోరికలు కలిగినప్పుడు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, అవకాశం దొరికితే వాళ్లపై అత్యాచారం చేసేవాడని పోలీసులు చెబున్నారు. ఇలాంటి మానసిక ప్రవర్తన కలిగిన వాళ్లు సమాజంలో తిరగడం అత్యంత ప్రమాదకరమని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Related image