Wednesday, October 16, 2019
Follow Us on :

ఆరోజు చేసింది తప్పే.. ఇప్పటికీ బాధపడుతుంటా: హర్భజన్

By BhaaratToday | Published On Jan 22nd, 2019

ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సంఘటనలు కొన్ని ఉంటాయి. వాటిలో శ్రీశాంత్ వెక్కి వెక్కి ఏడ్చడం కూడా ఒకటి. మ్యాచ్ ముగిశాక హర్భజన్ కొట్టడం.. శ్రీశాంత్ ఏడ్చడం అప్పట్లో సంచలనం అయ్యాయి. దీని తర్వాత హర్భజన్ ను కొన్ని మ్యాచ్ లు సస్పెండ్ చేశారు కూడా..! 2008 లో జరిగిన ఈ ఘటన ఇప్పటికీ హర్భజన్ జీవితంలో మచ్చ లాగా మిగిలిపోయింది. ఆ సమయంలో భజ్జీ ముంబై ఇండియన్స్ కు.. శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ప్రాతినిధ్యం వహించారు.   


తాను ఆరోజు శ్రీశాంత్‌ను కొట్టడం తప్పేనని మరోసారి ఒప్పకున్నాడు హర్భజన్ సింగ్. ఆ ఘటన పట్ల తాను ఇప్పటికీ బాధపడుతుంటానని పేర్కొన్నాడు. ఒకవేళ తనకు జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే శ్రీశాంత్‌ను చెంప దెబ్బ కొట్టిన ఘటనను మార్చుకుంటానని భజ్జీ తెలిపాడు. తాను అలా చేసుండాల్సింది కాదని, తాను తప్పు చేశానని చెప్పాడు. శ్రీశాంత్ అద్భుతమైన ఆటగాడు, అతడికి ఎంతో నైపుణ్యం ఉందని కితాబు ఇచ్చాడు.