Wednesday, October 16, 2019
Follow Us on :

ఛలానా డబ్బులు తీసుకుని.. హెల్మెట్లు ఇస్తున్నారుగా..!

By BhaaratToday | Published On Sep 6th, 2019

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవడం అందరూ గమనించే ఉంటారు. హెల్మెట్ లేకుండా పట్టుబడిన వాళ్లతో అంత డబ్బులు తీసుకోవడమే కాకుండా ఒక హెల్మెట్ కూడా ఇస్తే బాగుంటుంది అని..! అలా పోలీసులకు పట్టుబడిన ప్రతి సారీ హెల్మెట్ ఇస్తే తప్పకుండా బైక్ రైడర్స్ మారుతారని ఆ సోషల్ మీడియా పోస్టు ఉద్దేశ్యం. ఆ సోషల్ మీడియా పోస్టును సీరియస్ గా తీసుకున్నారు రాజస్థాన్ పోలీసులు. అందుకే 1000 రూపాయలు ఛలాన్ వేయడమే కాకుండా హెల్మెట్లు కూడా అందిస్తున్నారు. 

రాజస్థాన్ పోలీసులు వసూలుచేస్తున్న చలానాల డబ్బుతో హెల్మెట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై విధించే జరిమానాలతో వారికి ఉచితంగా హెల్మెట్ ను కొనుగోలు చేసి ఇస్తామన్నారు. ఇక అలాగే  జైపూర్ పోలీసులు ఓ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. జైపూర్ పోలీసులు వాహనదారుల వాహనాలపై కులం పేరు కానీ, ఊరి పేరు కానీ కనిపించడానికి వీల్లేదని చెప్పుకొచ్చారు. కులం, ప్రాతం, సంస్థలు, హోదాలను వాహనాలపై పేర్కొనడం సమాజంలో సమానత్వాన్ని దెబ్బతీస్తుందని పోలీసులు చెప్పారు. కులతత్వం వాహనాలపై కనిపించడం సామరస్యాన్ని దెబ్బతీస్తుందనే విషయంపై పౌర సమాజం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో, పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.