Tuesday, October 15, 2019
Follow Us on :

ఇక హీరో బైక్ లు డోర్ డెలివరీ

By BhaaratToday | Published On Aug 5th, 2019

దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల కంపెనీ అయిన హీరో మోటోకార్ప్‌ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి హీరో బైక్ లు డోర్ డెలివరీ చేయనున్నారు. అతి త్వరలో హైదరాబాద్ లోనూ ఆన్ లైన్ సేవలను ప్రారంభించనున్నట్టు ప్రపంచంలోనే అత్యధికంగా టూ వీలర్లను విక్రయిస్తున్న ప్రముఖ సంస్థ హీరో మోటో వెల్లడించింది. హీరో బైక్ లను కొనుగోలు చేసేవారికి హోమ్ డెలివరీ సేవలను కూడా అందించనున్నట్టు పేర్కొంది. వెబ్‌ పోర్టల్‌ ద్వారా కస్టమర్లు తమ వాహన హోమ్‌ డెలివరీ కోసం బుక్‌ చేసుకోవచ్చని, ఇందుకు రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. హోమ్ డెలివరీ కోసం అతి తక్కువ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే ముంబై, బెంగళూరు, నోయిడా ప్రాంతాల్లో హీరో మోటో హోమ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో 25 నగరాలకు ఆన్ లైన్ సేవలను విస్తరించనున్నట్టు సంస్థ వివరించింది. నేటి యువత ప్రతి కొనుగోలు విషయంలోనూ విలువ ఆధారిత సర్వీసులను కోరుకుంటున్నారని, ఇందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వస్తోందని  హీరో మోటోకార్ప్‌ సేల్స్‌ హెడ్‌ సంజయ్‌ భాన్‌ తెలిపారు.