Monday, September 23, 2019
Follow Us on :

హీరో నాగ శౌర్యకు ట్రాఫిక్ పోలీసుల ఫైన్

By BhaaratToday | Published On Aug 14th, 2019

ప్రముఖ టాలీవుడ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఈ కారులో నాగశౌర్య ప్రయాణిస్తున్నారు. ఆయన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటం గమనించిన పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రవి ఆ కారును ఆపి జరిమానా విధించారు. నాగశౌర్య కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పంజాగుట్ట పోలీసులు రూ.500 ఫైన్ విధించారు. కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను పోలీసులు తొలగించారు.