Wednesday, October 16, 2019
Follow Us on :

ఫ్యాన్స్ పై దూకిన హీరో..! పలువురికి గాయాలు..!!

By BhaaratToday | Published On Feb 5th, 2019

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ దూకుడు.. అతని ఫ్యాన్స్ పాలిట శాపమైంది. సాధారణంగా ఏ పబ్లిక్ ఈవెంట్‌కి హాజరైనా.. రణ్‌వీర్ కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటాడు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో రన్‌వీర్ చేసిన ఓ పని అతని ఫ్యాన్స్ కొందరిని గాయాలపాలు చేసింది. ఈ ఏడాది ‘సింబా’ చిత్రంతో మంచి సక్సెస్‌ని అందుకున్న రణ్‌వీర్.. ప్రస్తుతం అతని తాజాగా చిత్రం ‘గల్లీబాయ్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ ఈవెంట్‌లో రణ్‌వీర్ పాల్గొన్నాడు. అక్కడ స్టేజీపై తన సినిమా పాటలపై పర్ఫామెన్స్ చేసిన రణ్‌వీర్.. అదే ఉత్సాహంలో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి అక్కడ ఉన్న ఫ్యాన్స్‌పై దూకాడు. ఒక్కసారిగా రణ్‌వీర్ మీద పడటంతో అక్కడ ఉన్న కొందరు అభిమానులకు తీవ్రంగా గాయలయ్యాయి. దాదాపు నలుగురు అభిమానులు, అందులో ఒక అమ్మాయి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్ అయింది. రణ్‌వీర్ సింగ్ ఇటువంటి పిల్లచేష్టలు మానుకోవాలని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ఒకవేళ నేను అక్కడ ఉంటే.. నిన్ను కచ్చితంగా పట్టుకొనే వాడిని కాదు. అలాగే వదిలేస్తే వాడిని అని మరొకరు ట్వీట్ చేశారు.