Thursday, April 25, 2019
Follow Us on :

అతడిని చూసి ఎంతో ఎమోషనల్ అయిన వెంకటేష్

By BhaaratToday | Published On Mar 9th, 2019

దగ్గుబాటి వెంకటేష్.. యాంటీ ఫాన్స్ అంటూ లేని హీరో..! తన అభిమానుల కోసం కూడా ఆయన ఎంతైనా చేస్తారు. కేన్సర్ తో బాధపడుతున్న తన అభిమానిని కలుసుకున్న వెంకటేష్ బాగా ఎమోషనల్ అయ్యారు. వెంకీ తన అభిమాని ఆంకాక్షను నెరవేర్చి వార్తల్లో నిలిచారు. 

వెంకటేష్ ఎల్బీ నగర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ సురేష్‌ కోసం ఆయన ఇంటికి వెళ్లి కలిసాడు వెంకీ. సురేశ్ ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతనిని కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన అభిమాని పట్ల వెంకి చూపిన చొరవకు నెటిజన్లు మెచ్చుకుంటూ ఉన్నారు. ఇటీవలే ఎఫ్-2 సినిమా ద్వారా టాలీవుడ్ కు మాంచి హిట్ ఇచ్చారు వెంకటేష్.. ఇప్పుడు వెంకీమామ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.