Saturday, October 19, 2019
Follow Us on :

గోపాల గోపాల భామ అనీషా ఆంబ్రోస్ పెళ్ళి ఫిక్స్.. సీక్రెట్ గా నిశ్చితార్థం..!

By BhaaratToday | Published On Jan 25th, 2019


అనీషా ఆంబ్రోస్.. పేరు నార్త్ అమ్మాయిలా ఉన్నా అచ్చ తెలుగు అమ్మాయే..! అలియాస్ జానకి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ వైజాగ్ భామ. ఆ తర్వాత  పవన్ కళ్యాణ్ 'గోపాల-గోపాల' సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాలో రోల్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా చేయబోతోంది అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. రన్, కన్నడ సినిమా కర్వా, మనమంతా, ఉన్నది ఒకటే జిందగీ, ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాల్లో నటించి పాపులారిటీ సంపాదించింది. 

అనీషా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. గుణ జక్కా అనే వ్యక్తితో అనీషా నిశ్చితార్థం చేసుకుంది. చాలా తక్కువ మంది సమక్షంలో అనీషా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎంగేజ్ మెంట్ చాలా సింపుల్ గా చేశామని.. పెద్దగా హడావుడి లేకుండా జరపాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇంకొద్ది నెలల్లో వీరి పెళ్లి జరగనుంది.