Saturday, October 19, 2019
Follow Us on :

హై అలర్ట్.. లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఆరుగురు తీవ్రవాదులు ప్రవేశించారు

By BhaaratToday | Published On Aug 23rd, 2019

కోయంబత్తూరులో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఆరుగురు తీవ్రవాదులు తమిళనాడులోకి గురువారం నాడు ప్రవేశించారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఆరుగురు తీవ్రవాదులు శ్రీలంక నుండి తమిళనాడులోకి ప్రవేశించారు. వారిలో ఒకడు పాకిస్థానీ కాదా.. మిగిలిన వారు శ్రీలంకకు చెందిన తమిళ్ ముస్లిమ్స్ అని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వారంతా తిలకం, విభూతి ధరించి హిందువుల్లాగా వేషధారణ వేసుకొని ఉన్నారని అధికారులు తెలిపారు. పాకిస్థానీ పేరు ఇలియాస్ అన్వర్ అని కూడా తెలుస్తోంది.       

శ్రీలంక దాడుల తర్వాత తమిళనాడులో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఐబీకి సమాచారం అందింది. దీంతో కేంద్ర, రాష్ర్ట సెక్యూరిటీ సంస్థలు అలర్ట్‌ అయ్యాయి. ఆరు ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కోయంబత్తూరు పరిసర జిల్లాలతో పాటు, చాలా ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.