Monday, November 18, 2019
Follow Us on :

ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలి: హైకోర్టు

By BhaaratToday | Published On Oct 15th, 2019

ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని, సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వెళ్లాలని కార్మికులకు తెలంగాణ హైకోర్టు సూచించింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని.. నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నా కూడా సమ్మె చేయడం ఏమిటని కోర్టు కార్మిక సంఘాలను ప్రశ్నించింది. పండగలు, పాఠశాలు కొనసాగుతున్న తరుణంలో ఇలా సమ్మె ఎంతవరకు సమంజసమని కోర్టు తెలిపింది.  ఎస్మా ప్రయోగిస్తే ఏం చేస్తారని కార్మికులపై ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయపరమైనవే కావొచ్చు కానీ… సమ్మె చట్ట విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది.

ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశామని ప్రభుత్వం తరపున వాదించినా.. ప్రత్యామ్యాయ ఏర్పాట్లను చేసినప్పుడు విద్యా సంస్థలకు సెలవులను ఎందుకు పొడిగించారని కోర్టు ప్రశ్నించింది. సమ్మెపై రెండు రోజుల్లో ప్రభుత్వం పూర్తి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించింది. విచారణను ఈనెల 18కి హైకోర్టు వాయిదా వేసింది.