Tuesday, October 15, 2019
Follow Us on :

కొనసాగుతున్న మమతా బెనర్జీ దీక్ష.. ఆదివారం రాత్రి మొదలైన హైడ్రామా

By BhaaratToday | Published On Feb 4th, 2019

కోల్‌కతాలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న దీక్ష కొనసాగుతోంది. సెంట్రల్‌ కోల్‌కతాలో మమతా బెనర్జీ రాత్రి నుంచి దీక్షలో కూర్చున్నారు. రాజ్యాంగ పరిరక్షణ దీక్ష పేరిట మమతా బెనర్జీ నిరసన తెలుపుతున్నారు. కేంద్రం చర్యకు నిరసనగా మెట్రో ఛానల్‌ ఎదుట మమత దీక్ష నిర్వహిస్తున్నారు. మమతకు మద్దతుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు దీక్షలో పాల్గొన్నారు. బెంగాల్‌ అంతటా ఆందోళనలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి మొదలైన హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. 

ఇంతకూ ఏమి జరిగింది: 

శారదా స్కాంపై విచారణ జరుపుతున్న సీబీఐ బృందం ఆ కేసుకు సంబంధించి కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను విచారించేందుకు ఆయన ఇంటికి వెళ్లింది. దీంతో వెంటనే మమత కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఇంటికి వెళ్లారు. సీబీఐని నా ఇంటికి కూడా పంపించారని.. చిట్ ఫండ్ కుంభకోణంపై 2011లో మా ప్రభుత్వమే విచారణ ప్రారంభించిందని చెప్పారు. పేదల డబ్బును వెనక్కి రప్పించేందుకు మేం కృషి చేస్తున్నామని.. దోషులను పట్టుకునేందుకు మేం కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. మా పార్టీ నేతలను జైలులో పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలను రక్షించే బాధ్యత నాపై ఉంది. వారెంట్ లేకుండా పోలీస్ కమిషనర్ ఇంటికి సీబీఐ ఎలా వెళుతుంది అని ప్రశ్నించారు మమత. బీజేపీ తమను వేధిస్తోందని.. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ధర్నాకు దిగానన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను ధర్నా ప్రదేశం నుంచే ప్రవేశపెడతానని చెప్పారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు మోడీ, అమిత్ షా ఆదేశాలిచ్చి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం రాత్రి ఈ హైడ్రామా మొదలైంది.