Thursday, December 12, 2019
Follow Us on :

తెలంగాణ‌లో నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు: వాతావ‌ర‌ణ శాఖ

By BhaaratToday | Published On Jul 18th, 2019

వ‌ర్షాల‌పై ప్ర‌జ‌ల‌కు పూర్తిగా న‌మ్మ‌కం పోయింది. ఇటు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు భారీ వ‌ర్షాలు అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నా...ఇవి ఏ మాత్రం కురియ‌డం లేదు. తాజాగా వాతావ‌వ‌ర‌ణ శాఖ అధికారులు తెలంగాణ‌లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు. అరేబియా సముద్రంలో రుతుపవన కరెంట్ ప్రభావంతో పడమర గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా వచ్చే రెండు మూడు రోజుల్లో ఒడిశా తీరంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావం వల్ల నేటి నుంచి నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కుదులుతున్నాయని, ఫలితంగా భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. అలాగే, ఈ నెల 23 వరకు కోస్తా, రాయలసీమల్లో  విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కాగా, బుధవారం ఏపీలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.