
హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్.. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ఆయనకు హిందుత్వం అంటే ఎనలేని అభిమానం. గతంలో ఆయన భారత్ కు వచ్చి శివలింగాన్ని కడిగిన విషయం తెలిసి మన వాళ్ళు ఎంతగానో ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నో సార్లు ఆయన హరిద్వార్ కు వచ్చి వెళ్లారు. ఇప్పుడు మరోసారి ఆయన హరిద్వార్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానదికి హారతి కార్యక్రమంలో విల్ స్మిత్ పాల్గొన్నారు. భారత పర్యటన తనలో చైతన్యాన్ని నింపిందని.. ఈ పర్యటన ఓ అద్వితీయమైన అనుభవమని ఆయన అన్నారు. విభిన్నవర్గాలు, ఇక్కడి ప్రకృతి అందాలు నాకో కొత్త అనుభూతి. నన్ను నేను తెలుసుకోవడానికి ఇదెంతో ఉపయోగపడింది అని చెప్పుకొచ్చారు.
ఆయన హిందూ మతం గురించి భారతదేశ ఔన్నత్యాన్ని గురించి చాలాసార్లు గొప్పగా చెప్పారు. ఈయనే కాదు పలువురు హాలీవుడ్ ప్రముఖులు కూడా హిందుత్వాన్ని ఫాలో అవుతున్నారు.