Wednesday, October 16, 2019
Follow Us on :

ఇప్పుడు ఈ సినిమాపై అంద‌రి నోటా ఇదే నినాదం

By BhaaratToday | Published On Jan 28th, 2019

హౌ ఈజ్ ది జోష్....హై సర్... ఇప్పుడు అందరి నోటా ఇదే నినాదం. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్స్ పై తీసిన సినిమా లోని ఈ నినాదం ఇప్పుడు అందరూ చేస్తున్నారు. పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ రిటైర్డ్ సైనికులతో కలిసి బెంగుళూర్ లోని బెల్లందూర్ లోని సెంట్రల్ స్పిరిట్ మాల్ లో ఈ సినిమాను చూశారు. సినిమాను చూసిన నిర్మలాసీతారామన్ కూడా భారత్ మాతా కీ జయ్ అని నినాదాలు చేయడం విశేషం. 2016 సెప్టెంబర్‌ 18న జమ్ము కశ్మీర్ యురి సెక్టార్‌ లోని ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్ర‌తీకారంగా మన సైనికులు సెప్టెంబ‌ర్ 29న సాహసోపేతమైన సర్జిక‌ల్ స్ట్రైక్స్ చేశారు. దీంతో పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఈ వాస్తవ సంఘటన ఆధారంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని రూపొందించారు.