Tuesday, May 21, 2019
Follow Us on :

టార్చర్ తట్టుకోలేకపోయిన హృతిక్ రోషన్.. సినిమా రిలీజ్ వాయిదా..!

By BhaaratToday | Published On May 10th, 2019

హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పటివి కావు..! అప్పుడెప్పుడో హృతిక్ రోషన్ ను తన ఎక్స్ అంటూ కంగనా అనడం.. ఆ తర్వాత జరిగిన గొడవలు మొత్తం బాలీవుడ్ ను కుదిపేశాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. ఈమెయిల్స్ బయటకు రావడం.. మార్ఫింగ్ ఫోటోలు వైరల్ అవడం.. ఇలా ఎన్నో జరిగాయి. ఇక త్వరలో హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30', కంగనా నటించిన 'మెంటల్ హై క్యా' సినిమాలు ఒకే రోజు విడుదల కానుండడంతో మళ్ళీ వివాదం మొదలైంది. దీంతో హృతిక్ రోషన్ వివాదం ఎందుకులే అని అనుకున్నాడు. అంతే తన సినిమా విడుదలను వాయిదా వేయించాడు. 

అనవసరమైన టార్చర్ ను తట్టుకోలేక తన సినిమా 'సూపర్ 30' విడుదలను వాయిదా వేయించానని చెప్పాడు. నా సినిమాకు ఎలాంటి హాని జరగకూడదనే విడుదల తేదీలో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. తన నిర్ణయాన్ని నిర్మాతలు గౌరవించారని చెప్పాడు. కొన్నేళ్లుగా తనను వేధిస్తున్న వారిని కొందరు ప్రోత్సహిస్తున్నారని అన్నాడు. 'చూస్తూ ఉండు... కంగన చేతిలో నీ పని అయిపోయింది' అంటూ ట్విట్టర్ వేదికగా హృతిక్ ను కంగనా సోదరి రంగోలీ హెచ్చరించింది. ఈ బెదిరింపులపై హృతిక్ ఇలా స్పందించాడు.