Tuesday, October 15, 2019
Follow Us on :

అరవై 108 వాహనాలు అగ్నికి ఆహుతైపోయాయి..!

By BhaaratToday | Published On May 6th, 2019

చిన్న షార్ట్ సర్క్యూట్.. 60కి పైగా 108 వాహనాలు దగ్ధమైపోయాయి. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. దేవరయాంజాల వద్ద ఉన్న 108 అంబులెన్స్ సర్వీస్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదంలో 60 అంబులెన్స్ లు కాలిపోయాయి. 108 సేవలు అందించే ఈఎంఆర్ఐ సంస్థ ప్రధాన కార్యాలయం శామీర్ పేట సమీపంలోని దేవరయాంజాలలో ఉంది. ఇక్కడ రిపేరీల కోసం ఆ వాహనాలను తీసుకొని వస్తూ ఉంటారు.. అలా నిలిపిన వాహనాలే తగలబడిపోయాయి. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. క్షణాల్లో మంటలు వ్యాపించడం.. సిబ్బంది ఆలస్యంగా గుర్తించడంతో భారీ నష్టం జరిగిపోయింది. సిబ్బంది వాటిని ఆర్పడానికి చాలా కష్టపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళం హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే 60 అంబులెన్స్ లు కాలిబూడిదయ్యాయి.