Thursday, September 19, 2019
Follow Us on :

ఎయిర్ పోర్టుకు వెళ్లిన భార్యను ఇరికించాలని ప్రయత్నించిన భర్త.. చివరికేమైందంటే

By BhaaratToday | Published On Aug 17th, 2019

భార్య తనను విడిచి విదేశాలకు వెళ్ళిపోతోందన్న విషయం తెలుసుకున్న భర్త ఆమెను ఎయిర్ పోర్టులో అడ్డంగా ఇరికిద్దామని అనుకున్నాడు. కానీ అతడు చేసిన ప్రయత్నమే చాలా తప్పైనది. ఎయిర్ పోర్టు అధికారులకు ఫోన్ చేసి.. ‘ఓ మహిళా ఉగ్రవాది విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి చేయబోతోంది.. జాగ్రత్త’ అని భర్త ఫోన్ చెప్పాడు. నిజమేననుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ నెల 8న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకున్న పోలీసులు ఆ భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 

బవానా ప్రాంతానికి చెందిన నసీరుద్దీన్ కు బ్యాగుల తయారీ కంపెనీ ఉంది. అతడి కంపెనీలో పనిచేస్తున్న రఫీయాను నసీరుద్దీన్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె ఇటీవల ఉఫాధి కోసం గల్ఫ్ వెళ్లాలని అనుకుంది. దానికి నసీరుద్దీన్ ఒప్పుకోలేదు. వెళ్లొద్దు అని ఆమెను అడుక్కున్నా కూడా రఫీయా ఒప్పుకోకుండా వెళ్లిపోవాలని నిర్ణయించేసుకుంది.

 దీంతో నసీరుద్దీన్ ఇంటర్నెట్ లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నంబర్ తెలుసుకుని.. దుబాయ్ లేదా సౌదీకి వెళ్లబోయే విమానంలో ఓ మహిళా ఆత్మహుతి దళ సభ్యురాలు వస్తోంది. ఎయిర్ పోర్టులోకి రాగానే తనను తాను పేల్చేసుకుంటుంది. ఆమెను ఆపండి అని నసీరుద్దీన్ చెప్పాడు. అతడి కాల్ ను పోలీసులు సీరియస్ గా తీసుకుని అలర్ట్ చేశారు. అయితే ఆమె రాగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె దగ్గర ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకలేదు. ఆమెను విచారించగా తనను వెళ్లకుండా ఆపడానికే తన భర్త ఇలాంటి పని చేశాడని రఫీయా చెప్పింది. దీంతో నసీరుద్దీన్ పై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. విచారణలో భార్య రఫీయా విదేశాలకు పోకుండా ఆపడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని నసీరుద్దీన్ అంగీకరించాడు.