Tuesday, October 15, 2019
Follow Us on :

భర్తకు పుస్తకాలే ప్రపంచం.. భార్య ఏమి చేసిందంటే..!

By BhaaratToday | Published On Sep 1st, 2019

పెళ్లాయ్యాక భర్త తనతో సరదాగా గడపాలని.. తనను బాగా చూసుకోవాలని ఏ భార్యకైనా ఉంటుంది. చిన్న చిన్న ముచ్చట్లు.. చిలిపి సరదాలు.. అన్యోన్యంగా తమ సంసారం సాగాలని అనుకుంటూ ఉంటారు. కానీ కట్టుకున్న భర్త తనను కనీసం పట్టించుకోకపోవడమే కాకుండా.. పుస్తకాలే లోకంగా గడిపితే ఏ భార్యకైనా నచ్చుతుందా చెప్పండి. అందుకే ఆ భార్య తన భర్తకు విడాకులు ఇవ్వాలని అనుకుంది. అనుకోవడమే కాకుండా ఏకంగా కోర్టును ఆశ్రయించేసింది. ఆ యువకుడు కూడా ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, విడాకులు ఇవ్వాల్సిందిగా కోరడంతో కోర్టు కూడా షాక్ అయ్యింది. 

మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఉద్యోగం రాకముందే పెళ్లి చేసుకున్నాడు.  యూపీఎస్సీ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అతడు భార్యను అసలు పట్టించుకోవడం లేదు.  ఎప్పుడూ పుస్తకాలు ముందేసుకుని కూర్చునేవాడు. 

 కొత్త కాపురానికి వస్తే భర్త తనను పట్టించుకోకపోవడం లేదని తెగ బాధపడింది ఆ భార్య. అతని తల్లి బాగోగులు చూసేందుకు మాత్రమే పెళ్లి చేసుకున్నాడని గ్రహించి అతడితో కాపురం చేయలేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.  భార్య ఉందన్న విషయమే గుర్తులేనట్టుగా అతను ప్రవర్తిస్తుంటే తాను భరించలేకపోతున్నానని, తనకు విడాకులు మంజూరు చేయాలంటూ కోర్టును కోరింది. ఆ యువకుడు కూడా ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, విడాకులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాడు. దీంతో కోర్టు వారికి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పడింది.