Thursday, October 17, 2019
Follow Us on :

అమీర్‌పేట్ మెట్రో స్టేష‌న్‌ వ‌ద్ద‌ కల‌క‌లం రేపిన పెయింట్ డ‌బ్బా

By BhaaratToday | Published On Jul 17th, 2019

హైద‌రాబాద్‌లోని అమీర్‌పేట్ మెట్రో స్టేష‌న్ పిల్ల‌ర్ వ‌ద్ద‌ ఓ పెయింట్ డ‌బ్బా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. పిల్ల‌ర్ వ‌ద్ద ఎవ‌రో వ‌దిలేసి వెళ్లిపోయిన పెయింట్‌ డ‌బ్బా కొన్ని గంట‌ల పాటు అక్క‌డే ఉండ‌టంతో తీవ్ర భ‌యాందోళ‌న వ్య‌క్త‌మైంది. గతంలో అనేక పర్యాయాలు ఉగ్రదాడులకు గురైన హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ ఉగ్రసంచారంపై అనుమానాలు తొలగిపోలేదు. తాజాగా అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకున్న ఈ పరిణామమే అందుకు నిదర్శనం. అయితే అది బాంబు అయి ఉండ‌వ‌చ్చ‌ని ఆందోళన చెందడంతో డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆ పెయింట్ డబ్బాను పరిశీలించాయి. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.