Tuesday, October 15, 2019
Follow Us on :

బీరు బాటిళ్లతో స్నేహితుడిని కొట్టి.. దుప్పట్లతో మృతదేహన్ని చుట్టి.. ఓల్డ్ సిటీలో దారుణం..!

By BhaaratToday | Published On Feb 4th, 2019

హైదరాబాద్ బాలాపూర్ లోని అలీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఘర్షణకు దిగిన నాలుగురు స్నేహితులు ఓ యువకుడిని హత్య చేశారు. బీరు బాటిళ్లతో కొట్టి హుస్సేన్ సాధి అనే యువకుడి తన స్నేహితులే హతమార్చారు. అనంతరం దుప్పట్లతో మృతదేహన్ని చుట్టి ఇంట్లో వదిలి దుండగులు పరారయ్యారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

హుస్సేన్ సాది, చాంద్ పహిల్వాన్, ఇఫ్తేకార్, అజీజ్ మద్యం తాగారు. అక్కడి వరకూ సరదా సరదాగా గడిపిన తరువాత తాగిన మత్తులో సాదితో ఘర్షణకు దిగి విచక్షణారహితంగా బీరుసీసాలతో హుస్సేన్ తలపై బలంగా కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుస్సేన్ సాది చనిపోయాడని తెలుసుకున్నవారు మృత దేహాన్ని మాయం చేయాలనుకున్నారు.  దీంతో దుప్పట్లో చుట్టి.. జనాలు తిరగని ప్రాంతానికి తీసుకెళ్లి పడేశారు. తరువాత ఏమీ తెలియనట్లుగా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. హుస్సేన్ సాది ఇంటికి రాకపోవటంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు వ్యక్తుల్ని విచారించగా ఒక వ్యక్తి  అసలు విషయం బయటపెట్టేసాడు. మిగిలినవారు పరారీలో ఉండగా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.