Friday, December 06, 2019
Follow Us on :

హీరో హృతిక్ రోషన్‌పై హైద‌రాబాద్‌లో కేసు న‌మోదు

By BhaaratToday | Published On Jul 4th, 2019

సినీ హీరో హృతిక్ రోష‌న్‌తో పాటు ఓ జిమ్ డైరెక్ట‌ర్లపై హైద‌రాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. వివ‌రాల్లోకి వెళితే...‘జిమ్‌లో చేరి బరువు తగ్గించుకోండి’ అని ప్రకటనలు ఇచ్చి, తమ నుంచి డబ్బులు తీసుకున్న తరువాత సరైన శిక్షణ ఇవ్వటం లేదంటూ జిమ్ డైరెక్టర్లు, అంబాసిడర్లపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రముఖ కల్ట్ ఫిట్ అనే జిమ్ నిర్వాహకులు తమ నుంచి డబ్బులు వసూలు చేసి.. సరైన శిక్షణ ఇవ్వడం లేదంటూ కస్టమర్‌లు ఆందోళనకు దిగారు. అనంతరం కేపీహెచ్‌బీ పోలీసులకు జిమ్ డైరెక్టర్లు, అంబాసిడర్ అయిన ముఖేష్ బన్సాల్, అంకిత్ నగోరి, షణ్ముగవేల్ మణి సుబ్బయ్య, సినీ హీరో హృతిక్ రోషన్‌లపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 420(చీటింగ్), 406ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.