Monday, December 09, 2019
Follow Us on :

బైక్ పై ముగ్గురు వెళుతుండగా ఫోటో తీసిన పోలీసు.. యువకులంతా కలిసి అతన్ని

By BhaaratToday | Published On Sep 12th, 2019

వాహన దారులు ఎటువంటి నిబంధనలు పాటించకున్నా ఫైన్ భారీగా పడుతున్న సంగతి తెలిసిందే..! ఈ పని వలన చాలా మంది నిబంధనలను పాటిస్తూ ఉన్నారు. అయితే కొందరు మాత్రం ట్రాఫిక్ పోలీసులతో గొడవలు పెట్టుకోవడం.. తప్పించుకోడానికి ఏదైనా చేయడం లాంటివి చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో మాత్రం ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న యువకుల బైక్ ను ఫోటో తీశాడని అతన్ని చితక్కొట్టారు.    

ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. నీలోఫర్‌ కేఫ్‌ సమీపంలో విధుల్లో ఉన్న హోమ్ గార్డు, అటువైపుగా బైక్‌ పై త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న యువకులను గమనించి ఫోటో తీశాడు. టూ వీలర్ పై ముగ్గురు వెళుతుండగా, హోమ్ గార్డు తన వద్ద ఉన్న కెమెరాతో ఫోటో తీశాడు. ఆ విషయాన్ని గమనించిన ఆ యువకులు.. బండిని పక్కన ఆపి హోమ్ గార్డుపై దాడికి దిగారు. దీంతో హోమ్ గార్డు, వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు యువకులను గుర్తించే పనిలో పడ్డారు. అయితే నడిరోడ్డుపై అంత జరుగుతున్నా ఆ యువకులను అడ్డుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు.