Friday, March 22, 2019
Follow Us on :

మ‌ళ్లీ భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త‌త‌

By BhaaratToday | Published On Mar 15th, 2019

భారత్-పాక్ సరిహద్దుల్లో  మ‌ళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి పంజాబ్, జ‌మ్మూక‌శ్మీర్ సరిహద్దుల్లో భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొవడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని పాక్ కు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఎక్సర్ సైజ్ లో భారీ సంఖ్యలో యుద్ధ విమానాలు పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విమానాలన్నీ సూపర్ సోనిక్ వేగంతో ఆకాశంలో దూసుకుపోయాయి. కాగా బాలాకోట్ లోని జైషే మొహమ్మద్ స్థావరాలపై దాడి చేసినప్పటి నుంచి మన వాయుసేన అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఏ క్షణంలోనైనా శత్రు దేశంపై దాడికి దిగేలా సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే సరిహద్దుల్లోని ఎయిర్ బేస్ లలో జెట్ ఫైటర్లు భారీ సంఖ్యలో మోహరించాయి. ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్ లో ఉంది. రెండు రోజుల క్రితం పాక్ కు చెందిన యుద్ధ విమానాలు సరిహద్దు వద్దకు చొచ్చుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో, భారత వాయుసేన పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.