Monday, November 18, 2019
Follow Us on :

ఐబీ హెచ్చ‌రిక‌.. యూపీలో పేలుళ్లు జ‌ర‌గొచ్చు!

By BhaaratToday | Published On May 2nd, 2019

యూపీలో ప‌లుచోట్ల‌ బాంబు పేలుళ్లు జరిగే అవకాశముందని భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) హెచ్చరించింది. యూపీలోని చందౌలీ, మిర్జాపూర్‌, సోన్‌భద్రా ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరగొచ్చని పేర్కొంది. దీనిపై నిఘావర్గాలు యూపీ పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.

బుధవారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు జవాన్ల వాహనంపై పేలుళ్లు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 16మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. గడ్చిరోలి జిల్లాలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ ఐఈడీ పేలుళ్లు జరిపారు. ఈ ఘటనలో మరికొంత మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.