Wednesday, October 16, 2019
Follow Us on :

భారత్-పాకిస్థాన్ మధ్య రోజురోజుకీ యుద్ధవాతావరణం పెరిగిపోతోంది: ఇమ్రాన్ ఖాన్

By BhaaratToday | Published On Aug 22nd, 2019

కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక భారత్ మీద ఎన్నో ఆరోపణలు చేస్తోంది పాకిస్థాన్. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు మరోసారి కూడా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య రోజురోజుకూ యుద్ధ వాతావరణం పెరిగిపోతోందని ఆయన అన్నారు. భారత్ తో పాకిస్థాన్ శాంతి కోసం ఎన్నో సార్లు ప్రయత్నించిందని.. అయితే భారత్ మాత్రం  తమ చర్యలను భారత్ కేవలం బుజ్జగింపుల మాదిరిగానే భావిస్తోందని అన్నారు. భారత ప్రధాని మోదీని చర్చలకు ఆహ్వానించిన ప్రతిసారి తమ సైన్యాన్ని దెబ్బతీస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇరు దేశాల మధ్య రోజురోజుకూ యుద్ధ వాతావరణం పెరుగుతోందని ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. 

విదేశీ మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడిన తర్వాత ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.