Tuesday, October 15, 2019
Follow Us on :

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'బ్లాక్ డే' గా జరపాలట.. ఇమ్రాన్ ఖాన్ వికృత చేష్టలు

By BhaaratToday | Published On Aug 15th, 2019

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలను ఈ విషయంలో మద్దతు కోరింది పాక్. కానీ ఇప్పటివరకూ ఏ దేశం కూడా ముందుకు రాలేదు. దీంతో భారత్ పై విషం జల్లాలని ఆ దేశ నాయకులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా భారత్ మీద బురదజల్లే పనినే పెట్టుకున్నారు పాకిస్థాన్ నాయకులు. 

ఇక భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెత్త వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. "ఐఓకేలో 12 రోజుల కర్ఫ్యూ. చేతుల్లో భారీ ఆయుధాలతో అదనపు బలగాలు. ఆర్ఎస్ఎస్ గూండాలు చేరారు. సమాచార వ్యవస్థ పూర్తిగా కనుమరుగైంది. గతంలో గుజరాత్ లో ముస్లింలను ఏరివేసినట్టుగానే, మోదీ తనదైన శైలిలో జమ్మూకశ్మీర్ లో ముస్లింలను ఏరివేయాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. "సెర్ బ్రేనికా తరహాలో జరగనున్న నరమేధాన్నిఈ ప్రపంచం మరోసారి చూడనుంది. ముస్లింలను ఐఓకే నుంచి ఏరివేయడమే వారి లక్ష్యం. అంతర్జాతీయ సమాజానికి ఇదే నా హెచ్చరిక. ఇదే జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. హింస చెలరేగుతుంది. ముస్లిం సమాజం దీన్ని ఎంతమాత్రమూ సహించబోదు" అని వరుస ట్వీట్లు పెట్టాడు.   

అక్కడితో ఆగని ఇమ్రాన్ ఖాన్.. భారత స్వాతంత్య దినోత్సవం ఆగస్టు 15ను బ్లాక్ డే గా నిర్వహిస్తామన్నారు. అలాగే తన ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటోను నలుపు రంగులోకి మార్చేశారు. మోదీ ప్రభుత్వం నాజీ ఐడియాలజీని భారత్ లో అవలంబిస్తోందని.. దానికి నిరసనగా పాక్ ప్రధాని తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ పిక్ ను నలుపు రంగులోకి మార్చేశాడని పాకిస్థాన్ మీడియా చెప్పుకొంటూ వస్తోంది.