Tuesday, October 15, 2019
Follow Us on :

ఇమ్రాన్ ఖాన్ మాటలు.. మరీ దారుణంగా

By BhaaratToday | Published On Aug 22nd, 2019

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో అమాయక ప్రజలను భారత బలగాలు అణచివేస్తున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఇటీవల జరిగిన బక్రీద్(ఈద్ అల్ అధా)ను కూడా స్వేచ్ఛగా జరుపుకోనివ్వలేదని విమర్శించారు. మతం కారణంగా హింసకు గురయ్యేవారికి ప్రపంచం సంఘీభావం తెలుపుతోందన్న ఇమ్రాన్, భారత్ పరిధిలోని కశ్మీర్ లోనూ అణచివేతను నిలువరించాలని పిలుపునిచ్చారు.  భారత ప్రభుత్వం కశ్మీరీల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను నిరాకరిస్తోందనీ, తీవ్రమైన హింసకు పాల్పడుతోందని ఇమ్రాన్ ఆరోపించారు. 

కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక భారత్ మీద ఎన్నో ఆరోపణలు చేస్తోంది పాకిస్థాన్. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు మరోసారి కూడా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ మధ్య రోజురోజుకూ యుద్ధ వాతావరణం పెరిగిపోతోందని ఆయన అన్నారు. భారత్ తో పాకిస్థాన్ శాంతి కోసం ఎన్నో సార్లు ప్రయత్నించిందని.. అయితే భారత్ మాత్రం  తమ చర్యలను భారత్ కేవలం బుజ్జగింపుల మాదిరిగానే భావిస్తోందని అన్నారు. భారత ప్రధాని మోదీని చర్చలకు ఆహ్వానించిన ప్రతిసారి తమ సైన్యాన్ని దెబ్బతీస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.