Monday, September 23, 2019
Follow Us on :

పాలు కొనాలంటేనే భయపడిపోతున్నారు.. పాకిస్థాన్ లో లీటర్ పాలు ఎంత ధరో తెలుసా..?

By BhaaratToday | Published On Sep 12th, 2019

పాకిస్థాన్ లో ఇప్పుడు సామాన్యులు పాలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. అందుకు ముఖ్య కారణం పాలు ధర ఆకాశానికి చేరడమే..! ఆ దేశంలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ కంటే.. లీటర్ పాల ధరే చాలా ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా పాక్ లోని ప్రధాన నగరాల్లో లీటర్ పాలు ధర అంతకంతకూ పెరుగుతూ వెళుతోంది. ప్పుడు ఏకంగా 140 రూపాయలను తాకింది. 

 పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.113 కాగా, డీజిల్ రూ.91 రూపాయలు. అయితే లీటర్ పాలు మాత్రం రూ.120 నుంచి రూ.140 వరకు అమ్ముతున్నారు. కరాచీలోని కమిషనర్ కార్యాలయంలో మాత్రం పాల ధర రూ.94గానే చెప్పగా.. ఇక మార్కెట్ లో ఏకంగా 140 రూపాయలకు అమ్మేశారు. మొహర్రం కారణంగా డిమాండ్ పెరగడంతో భారీ రేటుకు లీటర్ పాలను అమ్మారు.