Saturday, August 24, 2019
Follow Us on :

నేడు అసీస్ తో చివ‌రి వ‌న్డే

By BhaaratToday | Published On Mar 13th, 2019

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌కు ముందు కోహ్లీసేన ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ లో భాగంగా చివరిదైన ఐద‌వ వ‌న్డే నేడు జ‌రుగ‌నుంది. ఇది సిరీస్‌ ఫలితాన్ని కూడా తేల్చే మ్యాచ్‌ కావడంతో అభిమానులు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. రెండు వరుస విజయాలతో సిరీస్‌ను ఆరంభించి, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన టీమ్‌ఇండియా.. చివరి వన్డేలో మాత్రం పట్టువదలకుండా పోరాడి సిరీస్‌ సాధించాలని భావిస్తోంది. ప్రపంచకప్‌ జట్టు కూర్పుపై స్పష్టత తెచ్చుకోవాలన్నా.. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలన్నా.. ఇంకా ఏం చేయాలన్నా మిగిలిన అవకాశం ఒక్కటే కావ‌డంతో ఆట‌గాళ్లు ప్రాక్టీసులో త‌ల‌మున‌క‌లై ఉన్నారు.

డిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా వేదిక‌గా జ‌రిగే ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు సాధ్యం కాకపోవచ్చని ప‌రిశీల‌కులు బావిస్తున్నారు. పిచ్‌ కొంచెం నెమ్మదిగా ఉంటుందని, బంతి బ్యాట్‌ మీదికి రాకపోవచ్చని చెబుతున్నారు. ఇక్కడి పిచ్‌ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలం. సాయంత్రం మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశముందని అంటున్నారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానుంది.