Monday, September 23, 2019
Follow Us on :

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో కూడా పాక్ కు చుక్కలే..!

By BhaaratToday | Published On Sep 11th, 2019

జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను ఇరుకున పెట్టేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. పలు దేశాల మద్దతు కోసం ప్రయత్నించింది కానీ.. పాకిస్థాన్ నిజస్వరూపం తెలిసిన ఏ దేశం కూడా పాక్ కు సపోర్ట్ ఇవ్వలేదు. అలాగే దౌత్య నీతిని మరచి పాకిస్థాన్ ఎంతో నీచంగా ప్రవర్తిస్తోంది. అయినా ఎక్కడికక్కడ భారత్ పాకిస్థాన్ నోరు మూయిస్తూ ఉంది.  ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో కూడా పాకిస్థాన్ కు భారత్ చుక్కలు చూపించింది. 

జమ్మూకశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని ఖండించిన భారత్, తన అంతర్గత విషయాల్లో మరో దేశం జోక్యాన్ని సహించబోమని చెప్పడంతో పాక్ నోరు మూసింది. ఈ సమావేశంలో భారత్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ సింగ్ ఠాకూర్ ప్రసంగిస్తూ  పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ అనంతరమే కశ్మీర్ విషయంలో మేం నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అన్నారు. దీనికి విస్తృత స్థాయిలో మద్దతు కూడా లభించిందని ఇది భారత అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు. ఇతర దేశాల్లో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతోందంటూ ఇటువంటి వేదికలపై ప్రసంగించేవాళ్లు తమ దేశంలో మైనారిటీల పట్ల ఎంత అణచివేతకు పాల్పడుతున్నారో గమనించాలి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. తమ భూభాగం మీద ఉగ్రవాదానికి ఆర్థిక, సైద్ధాంతిక మద్దతు ఇస్తున్న వాళ్లే అత్యంత దారుణంగా మానవహక్కులు ఉల్లంఘిస్తున్నారని ఆయన పాకిస్థాన్ ను చిక్కుల్లోకి నెట్టారు.