Thursday, September 19, 2019
Follow Us on :

పాకిస్థాన్ ను ఎక్కడైనా ఎదుర్కొంటాం.. గతంలో భంగపడిన విషయాన్ని మరచిపోయిందేమో

By BhaaratToday | Published On Aug 21st, 2019

జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసాక పాకిస్థాన్ చేస్తున్న ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. భారత్ ను చిక్కుల్లో పెట్టాలని అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ వీలుపడలేదు..! భారత్ లో ఉగ్రమూకలతో దాడి చేయించాలని కూడా భావిస్తోంది.. ఆ కుటిల యత్నాలను భారత్ ధీటుగా అడ్డుకుంటోంది. ఇప్పటికే పలుదేశాల మద్దతు కోసం ప్రయత్నించిన పాక్ కు ఒక్క చైనా తప్ప మిగిలిన ఏ దేశం కూడా వత్తాసు పలకడం లేదు. ఇప్పుడు అంతర్జాతీయ కోర్టులో సవాల్ చేస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. 

 దీనిపై ఐక్య రాజ్య సమితి (ఐరాస)లో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పందించారు. పాకిస్థాన్ ను ఎక్కడైనా సరే, ఏ వేదిక మీద అయినా సరే ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుంది. ఇండియాకు కూడా వివిధ రకాల మార్గాలు ఉన్నాయని ఆయన అన్నారు. వివిధ వేదికలపై కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తాలని చూస్తే... అవే వేదికలపై ఆ దేశాన్ని ఎదుర్కొంటామని తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ కోర్టులో ఇప్పటికే పాకిస్థాన్ కుల్ భూషణ్ జాధవ్ మరణశిక్ష విషయంలో చుక్కెదురైంది. ఇప్పుడు మరోసారి భంగపడడానికి రెడీ అవుతోందని ఆయన అన్నారు.