Tuesday, October 15, 2019
Follow Us on :

తోక జాడించారో.. భారత సైన్యం రెడీగా ఉంది: ఆర్మీ ఛీఫ్

By BhaaratToday | Published On Aug 13th, 2019

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్నిసృష్టిస్తోంది పాకిస్థాన్. లడాఖ్ సరిహద్దులో ఉన్న స్కర్దూ ఎయిర్ బేస్ కు మూడు సీ-130 యుద్ధ విమానాలను తరలించింది. అలాగే జేఎఫ్-17 ఫైటర్ జెట్లను కూడా తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దుల్లో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కదలికలను భారత నిఘా వ్యవస్థ నిశితంగా గమనిస్తోంది. 

దీనిపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. సరిహద్దుల వద్ద ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి భారత సైన్యం సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. సరిహద్దుల్లో పాక్ తోకజాడిస్తే సమర్థవంతంగా తిప్పికొడతామని ఆయన అన్నారు. సరిహద్దులకు భారత సైన్యాన్ని చేర్చడం వెనుక వేరే ఉద్దేశమేమీ లేదని.. ముందు జాగ్రత్త చర్యలుగానే సైన్యాన్ని తరలిస్తున్నామని ఆయన అన్నారు.  

ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని చెప్పారు. 1970-80 ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉండేదో, అదే ప్రశాంతత త్వరలోనే కనిపిస్తుందన్నారు బిపిన్ రావత్.