Wednesday, October 16, 2019
Follow Us on :

ఆ దేశాల సపోర్ట్ కూడా భారత్ కే.. పాక్ ఏమిచేస్తుందో..!

By BhaaratToday | Published On Sep 3rd, 2019

జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను ఇరుకున పెట్టేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా మాల్దీవుల పార్లమెంటులో పాకిస్థాన్ కు ఈ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకశ్మీర్ అన్నది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని మాల్దీవుల్లో జరుగుతున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన దక్షిణాసియా పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు తీర్మానించింది. 
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-సాధన అనే అంశంపై మాల్దీవుల్లో జరిగిన దక్షిణాసియా దేశాల స్పీకర్ల సదస్సులో పాకిస్థాన్ చేసిన ఆరోపణలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ తిప్పికొట్టారు. మాల్దీవులు పార్లమెంటులో జరిగిన సదస్సులో భాగంగా పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిమ్‌ సురీ మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. అయితే హరివంశ్‌ మాత్రం అంతర్జాతీయ వేదికలపై భారత్‌ అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేయడం సరైంది కాదని పాకిస్థాన్ కు కౌంటర్ ఇచ్చారు. పాక్‌ ఆరోపణలకు భారత్ గట్టిగా జవాబు ఇవ్వగలదని.. సదస్సు ముఖ్య ఉద్దేశం అది కాదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ‘ శాంతి స్థాపన, సుస్థిరావృద్ధికి ఆటంకం కలిగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు పాక్‌ సహాయం నిలిపివేయాలని చెబుతూ పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టేసరికి సైలెంట్ అయింది పాకిస్థాన్. 

రౌండ్ టేబుల్ సమావేశంలో పాక్ డిమాండ్ ను సదస్సు తిరస్కరించింది. పాకిస్థాన్-చైనా ఆర్థిక కారిడార్(సీపీఈసీ) విషయంలోనూ పాక్ సవరణలకు డిక్లరేషన్ లో చోటు దక్కలేదు.