Monday, December 09, 2019
Follow Us on :

భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలా..?

By BhaaratToday | Published On Sep 12th, 2019

జమ్మూకాశ్మీర్ లో శాంతిని నెలకొల్పటానికి భారత ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ పాక్ మాత్రం కాశ్మీర్ లో శాంతి అన్నది లేకుండా చేయాలని.. భారత్ లో ఉగ్రదాడులు జరిపి శాంతిని హరించాలని ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా లేదా అన్నదానిపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. 


భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల ప్రసక్తే లేదని విదేశాంగ మంత్రి షా మహ్మద్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికైతే చర్చలు జరిగే అవకాశం లేదన్నారు.  ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఎవరైనా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్ఆర్‌సీ)లో ప్రసంగం అనంతరం పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మీడియాతో మాట్లాడుతూ, కశ్మీర్‌ను ఇండియన్ స్టేట్ గా సంబోధించడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లో జనజీవనం యథాపూర్వ స్థితికి వచ్చిందనే అభిప్రాయాన్ని కలిగించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అదే నిజమైతే అంతర్జాతీయ మీడియాను ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించాడు.  భారతదేశంలోని జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎందుకు వీలు కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు.