Monday, September 23, 2019
Follow Us on :

శ్రీలంక క్రికెటర్స్ ని భారత్ బెదిరించిందట.. ఏ మాత్రం మారని పాకిస్థాన్ మంత్రి

By BhaaratToday | Published On Sep 10th, 2019

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి దశలో విఫలమవ్వడంతో పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఫవాద్ హుస్సేన్ మాత్రం భారత్ ను గేలి చేయాలని చూసాడు. అయితే అతడి మీద భారత నెటిజన్లు అంతకు మించి పంచ్ లు వేశారు. అయితే ఇప్పుడు మరోసారి  కూడా భారత్ మీద పడి ఏడుస్తున్నాడు ఫవాద్ హుస్సేన్. శ్రీలంక క్రికెటర్లు పాకిస్థాన్ టూర్ కు వెళ్ళకపోవడం వెనుక భారత్ ఉందని ఆరోపిస్తున్నాడు. పాకిస్థాన్ టూర్ కు కానీ శ్రీలంక క్రికెటర్లు వెళితే వారిని ఐపీఎల్ లో ఆడించబోమని బెదిరించారట.. అందుకే వారు పాకిస్థాన్ టూర్ కు రావడానికి భయపడుతున్నారని ఈ విషయాన్ని స్పోర్ట్స్ కామెంట్రేటర్లు తనకు చెప్పారని ఫవాద్ హుస్సేన్ ట్వీట్ చేశాడు. భారత అధికారులు చేసిన ఈ పనులు చాలా ఛీప్ ట్రిక్స్ అని వీటిని ఖండిస్తున్నామంటూ నోటికి వచ్చినట్లు చెప్పాడు ఫవాద్.   

సెప్టెంబరు 27 నుంచి శ్రీలంక జట్టు పాకిస్థాన్ గడ్డపై 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా పాకిస్థాన్ లో పరిస్థితులను కారణంగా చూపుతూ 10 మంది శ్రీలంక క్రికెటర్లు టూర్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. శ్రీలంక టి20 జట్టు కెప్టెన్ లసిత్ మలింగ సహా 10 మంది ఆటగాళ్లు పాకిస్థాన్ వెళ్లకూడదని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది.   పాకిస్థాన్ లో సెక్యూరిటీ సమస్యల కారణంగా ఇప్పటికే ఆ దేశంలో క్రికెట్ ఆడటానికి ఏ జట్లూ వెళ్లడం లేదు. ఎందుకంటే 2009లో లాహోర్ లో శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. శ్రీలంక ఆటగాళ్ళు తీవ్ర గాయాలపాలయ్యారు కూడా. ఈ ఘటన అనంతరం విదేశీ జట్లు పాకిస్థాన్ లో పర్యటించాలంటేనే భయపడిపోతున్నాయి. చివరికి పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కూడా వారి సొంత దేశంలో జరుపులేకపోతున్న పరిస్థితి ఆ దేశానిది. కానీ ఈ మినిస్టర్ మాత్రం ఇదేదో భారత్ చేసిన పని అని నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు.