Monday, December 09, 2019
Follow Us on :

భారత మిలటరీ కోసం రూ.9.32 లక్షల కోట్లు..!

By BhaaratToday | Published On Sep 10th, 2019

భారత మిలటరీని మరింత శక్తివంతంగా మలచాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రూ.9.32 లక్షల కోట్ల(130 బిలియన్‌ డాలర్ల)ను ఖర్చుపెట్టడానికి ముందుకు వచ్చింది. అది కూడా 5–7 ఏళ్లకు మాత్రమే.. ఇంత మొత్తంలో ఖర్చుపెట్టాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన  అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. 

భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కీలకమైన ఆయుధాలు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్లు, యుద్ధ నౌకలను సమకూర్చుకోడానికి రూ.9.32 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నారు. అంతేకాకుండా పదాతి దళాలను ఆధునీకరించడంతో పాటు ఆర్మీ కోసం 2,600 పదాతిదళ పోరాట వాహనాలు(ఐఎఫ్‌వీ), 1,700 అత్యాధునిక పోరాట వాహనాలను సమకూర్చనున్నారు. వాయుసేన(ఐఏఎఫ్‌) కోసం 110 మల్టీరోల్‌ ఫైటర్‌ జెట్లను కొనుగోలు చేయాలనున్నారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ముఖ్యమైన నగరాలపై శత్రుదేశాల క్షిపణి దాడులు జరగకుండా గగనతలాన్ని సురక్షితంగా ఉంచేందుకు మెగా ప్రాజెక్టు త్వరలో మొదలుకానుంది.