Saturday, October 19, 2019
Follow Us on :

ఉప్పల్ వన్డేలో ఈ తొలి వన్డే గెలిస్తే చరిత్రే..!

By BhaaratToday | Published On Mar 1st, 2019

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఆసీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఓడిన కసితో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో ఓటమి చవిచూడని కంగారూలు.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి రికార్డును పదిలపరుచుకోవాలని చూస్తున్నారు. గతంలో ఇక్కడ జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. 2007లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలైంది. ఉప్పల్ స్టేడియంలో బ్రహ్మాండమైన రికార్డు కలిగిన ఆసీస్ దానిని కాపాడుకోవాలని భావిస్తుండగా, పుష్కర కాలంగా అక్కడ అందని ద్రాక్షగా ఉన్న విజయాన్ని అందుకోవాలని కోహ్లీ సేన యోచిస్తోంది. ఆసీస్‌తో చివరిసారిగా జరిగిన ఏడు వన్డేల్లో ఆరింటిలో నెగ్గిన భారత్ ఆరింటిలో విజయం సాధించడం విశేషం.