Tuesday, June 18, 2019
Follow Us on :

ఈరోజు మ్యాచ్ లో వరుణుడు గెలుస్తాడేమో..!

By BhaaratToday | Published On Jun 13th, 2019

ఈ వరల్డ్ కప్ మొదలైనప్పటి నుండీ వర్షం తెగ చికాకుపెడుతోంది. ఇప్పటికే మూడు మ్యాచులు వర్షార్పణం అయిపోయాయి. అయితే ఇప్పటి వరకూ భారత్ ఆడిన రెండు మ్యాచ్ లకు వరుణుడు నుండి పెద్దగా ఇబ్బంది రాలేదు. అయితే  నేడు నాటింగ్ హామ్ లో ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ మాత్రం ఎక్కువగా వర్షార్పణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

ప్రస్తుతం అక్కడి పరిస్థితులు పూర్తీ మ్యాచ్ జరిగేలా కనిపించడం లేదు. ఈరోజు ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉండటంతో మైదానం మొత్తం చిత్తడిగా మారి, నీటితో నిండింది. ప్రాక్టీస్ సెషన్ కూడా జరగకపోవడం ఆటగాళ్ల సహనానికి పరీక్షగా మారింది. అయితే రోజు గడిచే కొద్దీ వర్షం తగ్గే అవకాశం కూడా ఉందట.. కాస్తంత ఆలస్యంగానైనా ప్రారంభమైనా మంచిదే.. లేదా టీ-20 గేమ్ జరిగినా అభిమానులు అంతో ఇంతో సంతోషిస్తారు. మూడు మ్యాచ్ లాడిన న్యూజిలాండ్ మూడు విజయాలతో ఆరు పాటింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్ రెండు మ్యాచ్ లాడి, రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఉంది. ఈరోజు మ్యాచ్ రద్దయితే ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ ల మధ్య జరిగే మ్యాచ్ వరకూ ఎదురుచూపులు తప్పవు మనకు..!  

Below is the weather forecast for the day at Nottingham: