Monday, December 09, 2019
Follow Us on :

మూడో రోజే బంగ్లా కథ ముగింపు..!

By BhaaratToday | Published On Nov 16th, 2019

ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేయగా.. 6 వికెట్లకు 493 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను భారత్ డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ పై తొలి ఇన్నింగ్స్ లో 343 ఆధిక్యాన్ని స్కోర్ బోర్డుపై ఉంచింది. మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు.

ఇక బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. షమీ బంగ్లాదేశ్ ను పూర్తిగా దెబ్బతీశాడు. 213 పరుగులకు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. మొహమ్మద్ షమీ 4 వికెట్లు, అశ్విన్ 3, ఉమేష్ యాదవ్ 2, ఇషాంత్ శర్మ 1 వికెట్ తీశారు. బంగ్లా బ్యాట్స్మెన్ లో రహీమ్ 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మయాంక్ అగర్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. నవంబర్ 22 న కోల్ కతా లో ఆడబోయే టెస్టు డే అండ్ నైట్ గా జరగనుంది. భారత్ ఆడనున్న మొదటి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.