Monday, December 09, 2019
Follow Us on :

పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టడానికి ఇంతకన్నా సాక్ష్యం అవసరం లేదేమో.. ఈ వీడియో చాలు..!

By BhaaratToday | Published On Sep 10th, 2019

జమ్మూకాశ్మీర్ లో శాంతిని నెలకొల్పటానికి భారత ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోంది. కానీ పాక్ మాత్రం కాశ్మీర్ లో శాంతి అన్నది లేకుండా చేయాలని.. భారత్ లో ఉగ్రదాడులు జరిపి శాంతిని హరించాలని ప్రయత్నిస్తోంది. అక్కడితో ఆగకుండా భారత్ లోకి తీవ్రవాదులను పంపించాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్ లోకి పంపి విధ్వంసం సృష్టించాలని భావిస్తోంది. కానీ పాకిస్థాన్ మాత్రం తాము అలాంటి పనులు చేయడం లేదని చెప్పుకొస్తూ ఉంది. ఇకపై ఆ మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా భారత సైన్యం దగ్గర ఆధారాలు ఉన్నాయి.

Image result for Indian Army foiled an infiltration attempt by a Pakistani BAT

Related image

పాకిస్థాన్ కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) ను అడ్డుగా పెట్టుకొని తీవ్రవాదులు భారత్ లోకి చొరబడాలని చూస్తున్నారు. బ్యాట్ కమాండోల దగ్గరే దాక్కున్న ఉగ్రవాదులు అనుకూల ప్రదేశంలో భారత్ లోకి ప్రవేశించాలన్న విషయాన్ని భారత సైన్యం పసిగట్టింది. బ్యాట్ కమాండోలు, ఉగ్రవాదుల శవాలు చెల్లాచెదరుగా పడివున్న దృశ్యాలను భారత్ ఆర్మీ బయటపెట్టింది. మృతదేహాల వద్ద పాకిస్థాన్ జెండాలు, ఇతర సామగ్రి కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఆగష్టు మొదటి వారంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కుప్వారా లోని కెరన్ సెక్టార్ కు సంబంధించిన ఈ వీడియోలను ఆర్మీ బయట పెట్టింది.